తుపాన్ తాకిడికి గురైన పంటలను పరిశీలించ నున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా 

నవతెలంగాణ – అశ్వారావుపేట
నేడు అనగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇటీవలే మీచౌంగ్ తుపాన్ తాకిడికి గురైన పంటలను పరిశీలించిన ఉన్నట్లు ఆయన కార్యాలయం నుండి గురువారం ప్రకటన విడుదల చేసారు. శుక్రవారం ఉదయం 09:30 గంటలకు దమ్మపేట మండలం పేరంటాల చెరువు అలుగు పరిశీలిస్తారు,10 గంటలకు మల్కారం లో పంట నష్టపోయిన బాధిత రైతులను పరామర్శిస్తారు. ఉదయం 10:35 గంటలకు అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి లో పంట నష్టపోయిన రైతులను ఓదార్చుతారు. ఈ కార్యక్రమానికి రెండు మండలాల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు అయి విజయవంతం చేయాలని కోరారు.