నవతెలంగాణ- వలిగొండ రూరల్
మండలంలోని సుంకిశాలలో ప్రవాస భారతీయులు పైళ్ల మళ్ళా రెడ్డి సాధన దంపతుల సౌజన్యం తో నిర్మించిన ఆలయ సముదాయంలో 26 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం విష్వక్సేన పూజా, పుణ్యాహవచనం, రుత్విక్కరణం, రక్షాబంధనం, అంకురార్పణ, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 10 వ తేదీన నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవానికి మున్సిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని, జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ని, స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని, మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిని ఆలయ కమిటీ ఛైర్మెన్ పైళ్ల ఉపేందర్ రెడ్డి కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, శ్రీ వెంకటేశ్వర స్వామీ సాంఘిక సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.