నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని టి పి సి సి సభ్యులు గంగారపు అమృత రావు మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రజాస్వామ్యకబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తొందరపాటుతనంతో ప్రభుత్వం ఏర్పడక ముందే మూడు ఆరు నెలలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చోద్యం చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామిక దేశంలో పరిపాలన ఏవిధంగా ఉంటుందో అన్నీ తెలిసిన ఏమి తెలియని అమాయకుల్లాగా ప్రజలను అయోమయంలోనికి తీసుకురావడానికి చేస్తున్న వాక్యాలను బహిరంగంగా వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో స్థానిక ప్రజలు ఊర్లోకి రాకుండా చేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పూర్తి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ముఖ్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ యాజమాన్యం ఎన్ని కుట్రలు పడిన,ఎంత అసూయపడిన వారి చేతి రోమాలను కూడా తీయలేరని అన్నారు. బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఓట్లు ముందు ఒకరినొకరు దూషించుకున్న నేటితో ఒకరికొకరుమని కలగంటున్నా పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కూలుగొట్టాలని కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడితే, కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ విధంగా తలెత్తుకొని తిరగలేరని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో ఇచ్చిన తీర్పుకు,రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని దుర్దేశాలతో పడుతున్న కుట్రలకు ప్రజలు కొన్న ఎమ్మెల్యేలను, కొంటున్న నాయకులను రోడ్లను ఎక్కకుండా చేస్తారని సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా ఆలోచించేయాలని ఇలాంటి కుట్ర పూరిత మాటలను కట్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు యామిని సురేష్, కొలిపాక దుర్గయ్య చోల్లేటి కృష్ణారెడ్డి, రావుల వెంకట్ రెడ్డి, మాచర్ల రవీందర్, మాచర్ల రవీందర్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి,బొడ్డు వసంత్ కుమార్, తిరుపతి, మాజీ ఎంపీటీసీలు అంకం రాజకుమారి, కొలిపాక లక్ష్మి, మాధవరెడ్డి, తిరుపతి, గా జుల సదానందం తదితరులు పాల్గొన్నారు.