– రాజన్నను దర్శించుకుంటే పదవులు రావని దుష్ప్రచారం..
– వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
బీఆర్ఎస్ అధికార ఉంది అనే కేసీఆర్ కేటీఆర్ మాటల గర్వంతో, అహంకారం వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయ చైర్మన్ గా పని చేస్తే, రాజన్నను దర్శించుకుంటే పదవులు రావని పదవులు ఊడుతాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేశారని శ్రీనివాస అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని భావించి అందరించడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రజలందరికీ 6గ్యారంటీ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని,అందులో రెండు నేటి నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం రూ 10 లక్షలు పెంపు చేయడం జరుగుతుంది అని వెల్లడించారు. మిగితా పథకాలు 100 రోజులలో అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని అన్నారు.రాజన్న కు దర్శించు కుంటే పదవులు పోతాయని ఒక్క దుష్పచరం చేశారు. కానీ అదే రాజన్నను మొక్కు కుంటే ఎమ్మెల్యే గ అవకాశం వచ్చింది. పిసిసి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి స్వామి వారికి కోడె మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది,వారు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది అని తెలిపారు. రాజన్నకే శేతగోపం పెట్టీ ఏటా వంద కోట్లు ఇస్తా అంటూ స్వామి వారిని మోసం చేయడంతో ఈ రోజు రాష్ట్రంలో అధికారం కోల్పోవడం జరిగిందని తెలిపారు. నన్ను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని,వారి కష్ట సుఖాల్లో పలు పంచుకొని అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య,ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు పులి రాంబాబు గౌడ్ , పుల్కం రాజ్, కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్.