నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నామని శుక్రవారం బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్ అన్నారు.రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని..ప్రజా తీర్పు ప్రకారం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనుల్లో,ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.