‘వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే నిధులను ప్రభుత్వ ట్రెజరీలోనే ఉంచండి’

తిరువనంతపురం: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుంటే ప్రభుత్వ ట్రెజరీలోనే నిధులను ఉంచాలని పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు (పిఎస్‌యు), ఇతర ప్రభుత్వ సంస్థలను కేరళ ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 1న ప్రిన్సిపల్‌ సెక్రటరీ (ఫైనాన్స్‌) రవీంద్ర కుమార్‌ అగర్వాల్‌ సర్క్యులర్‌ జారీ చేశా రు. ‘బ్యాంకులు, ఇతర అవకాశాల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుంటే అన్ని పిఎస్‌యులు, స్వయంప్రతిపత్త సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యం లేదా ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు తమ నిధులు, లాభాలను రాష్ట్ర ట్రెజరీలోనే ఉంచాలి’ అని సర్క్యులర్‌ల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ట్రెజరీ కంటే తక్కువ వడ్డీ రేటు ఇస్తున్నా అనేక పిఎస్‌ యులు, ఇతర సంస్థలు తమ నిధులు బ్యాంకుల వద్ద భారీగా డిపాజిట్‌ చేయ డాన్ని ప్రభుత్వం గమనించిందని అన్నారు. పిఎస్‌యులకు తమ సొంత డిపాజిట్ల నుంచి గరిష్ట ప్రయోజనం పొందే హక్కు ఉందని అంగీకరిస్తున్నామని అన్నారు.
అయితే అది ప్రజల సొమ్ము కాబట్టి అటువంటి పెట్టుబడి నుంచి గరిష్ట రాబడి పొందాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
2018 ఆగస్టులో పిఎస్‌యులకు ఇతర సంస్థలకు తమ నిధులను ట్రెజరీలో లేదా తమకు నచ్చిన షెడ్యూల్డ్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసుకునే అవకాశాన్ని కేరళ ఆర్థిక శాఖ కల్పించింది.న