– ఆశ్వారావుపేటకు పొంచి ఉన్న ప్రమాదం
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇటీవల సంభవించిన మీచౌంగ్ తుఫాన్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చేతికందిన పంటలతో పాటు, ఇటీవల నిర్మించిన అంతర్గత రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. దాంతో ఆయా మార్గాల్లో ప్రయాణం చేసే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. అయినా సంబంధిత శాఖల అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. మండలంలోని నారంవారిగూడెం నుంచి మొద్దులు గూడెం మధ్య ఉన్న కల్వర్టు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ వరద తాకిడికి పెద్ద వృక్షం సైతం వేర్లతో సహా విరిగిపోయింది. నారంవారిగూడెం నుంచి గుర్రాలు చెరువు దారిలో రెండు కల్వర్టులు సమీపంలో రహదారి పూర్తిగా శిధిలం అయింది. ఈ రెండు మార్గాల్లో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, తక్షణమే మరమత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.