అశ్వారావుపేట లో సోనియా పుట్టిన రోజు వేడుకలు

నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో  ఏఐసిసి పూర్వ అధ్యక్షులు సోనియా గాంధీ 77 వ పుట్టిన రోజు వేడుకలను సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ ఆద్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చొరవ చూపిన సోనియా పుట్టినరోజు జరుపుకోవడం,ఇదే రోజు కాంగ్రెస్ మ్యాన్ఫెస్టో లోని ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీ లలో రెండు పథకాలకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.అలాగే తెలుగు తల్లికి గౌరవ వందనం ఎలా చేస్తామో అదేవిధంగా నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన  సోనియా గాంధీ ని గౌరవించు కోవడం మనందరి బాధ్యత అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు.భారతదేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు ఒక కార్యకర్త లా పని చేసారే తప్ప పదవి ఆశించలేదు అన్నారు.అందుకు నిదర్శనం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడమే నని,తెలంగాణ కు మూడో ప్రభుత్వానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లో తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను స్పెషల్ గ్యాలరీలు కూర్చోబెట్టి  గౌరవించడం గొప్ప విషయం అన్నారు.రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ఏ రోజున కూడా తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు గౌరవించ లేదన్నారు. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా అత్యధిక కాలం పని చేసిన ఘనత ఒక సోనియా కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఎ.సి.ఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, ఎం.పి.టి.సి లు సత్వవరపు తిరుమల బాలగంగాధర్, వేముల భారతి ప్రతాప్,జల్లిపల్లి దేవరాజు,జూపల్లి ప్రమోద్, నన్ను రమేష్. పలగాని సుబ్బారావు,చల్లా రమాదేవి,మందపాటి వెంకన్న బాబు, నాగలక్ష్మి, బాజీ, సుదర్శన్,నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.