నవతెలంగాణ – ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గంలో చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి డివిజన్ నాయకులు రణధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చైతన్యపురిలోని పార్టీ కార్యాలయంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి ఆ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రాం రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య మొదటి రోజే ఐదు హామీల అమలుకోసం ఉత్తర్వు జారీ చేశారని కొనియాడారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్లైన్ క్విజ్ పోటీల్లో యువకులందరూ పాల్గొనాలని కోరారు. అనంతరం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన యువకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ మతిన్ షరీఫ్, డివిజన్ ఉపాధ్యక్షుడు మాతంగి యాదగిరి, ప్రధాన కార్యదర్శి తోకటి కిరణ్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు కారుకొండ శివ, యూత్ కాంగ్రెస్ రేండ్ల శివ, ఘనసాల చింటూ, సాయి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.