బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యకులు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌వీ యునివర్సిటీ సినేట్‌ హాల్‌లో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావు లూరి ముని బాల కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌ మారేష్‌ అద్యక్షత మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణయ్య మాట్లా డుతూ. ఉద్యోగులు ఐకమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలు కులాల పేరు మీద విడిపోవడం వల్ల న్యాయమైన డిమాండ్లు సాధించలేక పోతున్నారన్నారు. బీసీ లలో బానిస ఆలోచన విధానం పోవాలన్నారు. బీసీలు తెగించిన పోరాడకపోతే భానిస బతు కులు, బిక్షపు బ్రతుకులు బతక వలసి వస్తుందని హెచ్చరిం చారు. 75 సంవత్సరాల తరువాత రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించకపోతే ఇదేమి ప్రజా స్వామ్యమని ప్రశ్నించారు.
బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడా నికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవని.. రాజ్యాంగ బద్ధమైన మండల్‌ కమిషన్‌ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్పు చేసింది అని తెలిపారు. చట్టబద్దమైన పార్లమెంటరీ కమిటీ చైర్మెన్‌ నాచియప్పన్‌ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందన్నారు. ఇక ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం బీసీ ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పిందన్నారు. ఈ మహాసభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, భుపేష్‌ సాగర్‌,వేముల రామకృష్ణ, తనూజ, ఉదరు తదితరులు పాల్గొన్నారు.