ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలి

– ఏసీపీ రమణగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణ-శంకర్పల్లి
చెత్తను తగ్గించడం ప్లాస్టిక్‌ వినియోగించకుండా ఉండటం వల్ల పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని నార్సింగ్‌ ఏసీపీ రమణ గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌ కుమార్‌, కమిషనర్‌ ఆర్‌ జ్ఞానేశ్వర్‌ అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్‌ పరిధిలోని మనీ ఫంక్షన్‌ హాల్‌ లో స్వచ్ఛసర్వేక్షన్‌ 2023 తడి చెత్త, పొడి చెత్త హాని కరమైన పొడి చెత్తను వేరు చేయుటకై వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తను తగ్గించడం ప్లాస్టిక్‌ వినియోగించకుండా ఉండటం చెత్తను వేరుచేసి తిరిగి ఉపయోగించటం రీసైకిల్‌ చేయడం కంపోస్టు మొదలగు చేయడం ప్రతి వార్డులో సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి వార్డులోకి మున్సిపల్‌ కు సంబంధించిన చెత్త బండి వస్తుందని చెత్త బండి లోనే వేయాలని సూచించారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండిలోనే వేయాలన్నారు. ప్రజలందరూ వాటర్‌ వేస్ట్‌ చేయకుండా చూసుకోవాలన్నారు. పట్టణ పరిశుభ్రత ముఖ్యంగా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ వాడటం వల్ల అనర్థాలు జరుగుతాయని అన్నారు. ఇంటిదగ్గర కొబ్బరి చిప్పలు పాత సైకిల్‌ టైర్‌ స్కూటర్‌ టైర్లు ఉండటం వల్ల వాటిలో నీరు నిలిచి దోమలు చేరి గుడ్లు గుడ్‌ పెడతాయని అలాంటి వాటిని ఉండకుండా జాగ్రత్త పడాలి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్లు , మున్సిపల్‌ సిబ్బంది, ప్రజలు తదితరులు ఉన్నారు.