– ప్రొఫెసర్ కె.లక్ష్మీ నారయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ దళితులకిచ్చిన హమీలను అమలు చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె.లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని హైదర్గూడ మాలిక్ చాంబర్లో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘ కొత్త ప్రభుత్వం దళితుల అకాంక్షలు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కేసీఅర్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హమీలను అమలు చేయకపోవటం వల్లనే ఒటమి పాలయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ ఆశలు నేరవేరుస్తుందనే నమ్మకంతో ఓటు వేశారని గుర్తు చేశారు. వారి ఆశలను వమ్ము చేయవద్దన్నారు. విద్యకు బడ్జెట్లో 15 శాతం నిధులను కేటాయించి, దాన్ని బలోపేతం చేయాలని సూచించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం దళితుల సంక్షేమం,అభివృద్ధి రక్షణలకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకొవాలన్నారు…ఎస్సీ ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన హైపవర్ కమిటి వేసి ప్రతి ఆరునెల్లకోసారి సమిక్షించాలని కోరారు. దళితుల పై జరుగుతున్న దాడులను ఆరికట్టాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామి, సామాజిక భద్రత తదితర చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భామ్సేఫ్్ కేంద్ర కమిటి సభ్యులు డాక్టర్ కుమార్,డీబీఎఫ్్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబాషి సంజీవ్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, భారతీయ విద్యార్ధి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవితేజ, సతీష్,నవిన్,కవిత తదితరులు పాల్గొన్నారు.