ప్రజాదర్బార్‌కు తరలి వస్తున్న ప్రజలు

ప్రజాదర్బార్‌కు తరలి వస్తున్న ప్రజలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ఆదివారం మూడో రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలు తరలి వచ్చారు. వృద్దులు, వికలాంగులు, మహిళలు పెద్దఎత్తున ప్రజాదర్బార్‌కు వచ్చారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజాదర్బార్‌లో సమర్పించారు. ఇప్పటికే సమస్యలను చెప్పుకున్న వారికి సంబంధిత శాఖ త్వరలోనే పరిశీలిస్తుందని సందేశాన్ని పంపిస్తున్నారు. సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తేనున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు ముషారఫ్‌ అలీ, రవికుమార్‌ ప్రజాదర్బార్‌ నిర్వహణను సమన్వయం చేశారు.