సీఎం ఎ.రేవంత్‌రెడ్డికి వీఆర్వో జేఏసీ శుభాకాంక్షలు

సీఎం ఎ.రేవంత్‌రెడ్డికి వీఆర్వో జేఏసీ శుభాకాంక్షలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్‌ గోల్కొండ సతీశ్‌, అడిషనల్‌ సెక్రటరీ జనరల్‌ పల్లెపాటి నరేశ్‌, నాయకులు సర్వేశ్‌, చింతల మురళి, ప్రతిభ, రాజమల్లు, శ్రీరామ రమేష్‌, మాతృ నాయక్‌, నరసింహారెడ్డి, మహేష్‌, మేకల రమేష్‌, సుదర్శన్‌, రమేష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గత సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను కలువకుండా దూరం పెట్టారని వారు సీఎం ఎదుట వాపోయారు. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుంచి ఇప్పటివరకూ అన్యాక్రాంతమైన భూకబ్జా వివరాలను అందేస్తామని సీఎంకు తెలిపారు. ధరణి వ్యవస్థ తీసుకొచ్చి తమను ఇబ్బందులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిపాలన వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి గ్రామ రెవెన్యూ అధికారులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి పునర్‌వైభవానికి నాంది పలుకుతానని సీఎం హామీనిచ్చారని గోల్కొండ సతీశ్‌ తెలిపారు.