నవతెలంగాణ భువనగిరి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా నందిగామలో నాలుగవ జాతీయస్థాయి కుంగుపు, కరాటే పోటీలలో పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి స్కూల్ కు చెందిన విద్యార్థులు అండర్ 12 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ తో పాటుగా ప్రశంసా పత్రం పొందినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య యాదవ్ తెలిపారు. డిసెంబర్ 4వ తేదీన జాతీయస్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలలో ప్రశాంతి స్కూల్ కు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థులు తోగరు జస్వంత్ శర్మ అండర్ 12 విభాగంలో గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రం గెలుపొందినట్లు తెలిపారు. ఆరవ తరగతికి చెందిన తోగరు వర్షిని అండర్ -10 విభాగంలో గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రం గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యాదయ్య మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు చదువుతూ చదువుల తో రాణిస్తూ మార్షల్ ఆర్ట్స్ లో గెలుపొందినందుకు అభినందనలు తెలుపుతూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ముందు భవిష్యత్తులో బాగా రాణించాలని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. కాగా ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ జాతీయస్థాయిలో పొందడం పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.