రెంజల్ మండలంలో ఆటో డ్రైవర్ల ధర్నా

– ప్రత్యన్మయ ఉపాధి కల్పించాలని వినతి..
నవతెలంగాణ-రెంజల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టుతున్నారని ఆటో డ్రైవర్ ధర్నా నిర్వహించారు. బుధవారం రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తమ ఆటోలో ఎవరు ఎక్కడం లేదని, దీంతో తమ కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ప్రతి నెల జీవన భృతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆటో డ్రైవర్లకు నెలకు పదిహేను వేల రూపాయల జీవనభృతి కల్పించాలన్నారు. అనంతరం వారు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం నాయకులు షాహిద్, అబ్దుల్ అజీజ్ ఎస్ కె .హైమద్ జాను, రూపేష్, ఖదీర్, ఎండి .ఖలీల్, అబ్బన్న, రహఫ్, శేఖర్, లతీఫ్, తస్లిం తదితరులు పాల్గొన్నారు.