భోపాల్ : మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంగూబారు పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్డా ప్రమాణం చేశారు. భోపాల్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు మోహన్ యాదవ్ భోపాల్‌లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు.