మంత్రి సీతక్కకు సర్పంచుల సంఘం నేతల శుభాకాంక్షలు

మంత్రి సీతక్కకు సర్పంచుల సంఘం నేతల శుభాకాంక్షలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర పంచాయతీరాజ్‌ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కి రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్‌, మహిళా అధ్యక్షులు జూలూరు ధనలక్ష్మి, కార్యవర్గ సభ్యులు వెంకటేష్‌, రామేశ్వర్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆమెను వారు కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుచ్ఛగుచ్చం అందజేశారు. శాలువాతో సత్కరించారు. ఐదేండ్లలో సర్పంచులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచులను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించీ ఆరా తీశారు. త్వరలోనే సర్పంచుల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని మంత్రి హామీనిచ్చారు.