రాష్ట్రస్థాయి హాకీ  టోర్నమెంట్ కు ఎల్లారెడ్డి పల్లి విద్యార్థులు ఎంపిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 8న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్ జిఎఫ్) అండర్-14 సంవత్సరాల బాల బాలికల ఉమ్మడి  నిజామాబాద్ జిల్లా హాకీ ఎంపికలు కామారెడ్డి లో నిర్వహించామని,అని పోటీలలో లావుడియా రాకేష్,లావుడియా గుర్నాథ్ ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారా చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 16 ,17, 18 తేదీలలో కామారెడ్డి లో జరగబోయే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని వివరించారు.   అదేవిధంగా ఈనెల 13న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్ జిఎఫ్) అండర్-17 సంవత్సరాల బాల బాలికల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హాకీ ఎంపికలు  ఆర్మూర్  జావిద్ భాయ్ మినీ స్టేడియంలో నిర్వహించారని ఇందులో లావుడియా అరవింద్, బోధన్ మల్లికార్జున్, లావుడియా జీవన్ ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారా చంద్రశేఖర్, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ గుర్రపు నరేష్, ఎంపీటీసీ తలారి బాబురావు, ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు తదితరులు అభినందించారు.