– ఎస్‌బీఐ ఎస్ &పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్
– కొత్త ఫండ్ ఆఫర్ 2023 మే 18, శుక్రవారం ప్రారంభమై, 2023 మే 24, బుధవారం ముగుస్తుంది.
– బీఎస్‌ఈ లిమిటెడ్‌లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలులో 40% పైగా వాటా ఉన్న, 30 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఎస్ & పి బిఎస్ఈ సెన్సెక్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం
– భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల వ్యాప్తంగా 30 అతిపెద్ద, అత్యంత లిక్విడ్, ఇంకా ఆర్థికంగా అత్యుత్తమ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం
నవతెలంగాణ – ముంబాయి: భారత్‌లో అతిపెద్ద దేశీయ ఫండ్ హౌస్‌గా నిలుస్తున్న ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్&పి బిఎస్ఈసెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఓపెన్-ఎండెడ్ స్కీమ్ ఇది, ప్యాసివ్ ఫండ్ అయినందున, మిగతా వాటితో పోలిస్తే తక్కువ వ్యయాలతో, ప్రభావవంతంగా ఉంటుంది. ఈ స్కీమ్ కోసం కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) 2023 మే 18 – 2023 మే 24 మధ్య అందుబాటులో ఉంటుంది. ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ కూర్పును ప్రతిబింబించడంతో పాటు ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ పనితీరుకు తగ్గట్లుగా, ట్రాకింగ్ లోపాలకు లోబడి రాబడులను అందించమే ఈ స్కీమ్ యొక్క పెట్టుబడి లక్ష్యం. అయితే, స్కీమ్ పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే హామీ లేదా భరోసా లేదు.
ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఎండీ & సీఈఓ శ్రీ షంషేర్ సింగ్ మాట్లాడుతూ: ‘‘ఒక ఫండ్ హౌస్‌గా, మా యాక్టివ్‌గా నిర్వహించబడే ఫండ్‌లతో పాటు, ప్యాసివ్ పెట్టుబడుల విభాగంలో మేము పటిష్టమైన ప్రాంచైజీని నెలకొల్పాము. తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు, వేరే వాటితో పోలిస్తే తక్కువ వ్యయాలతో విస్తత స్థాయిలో మార్కెట్‌ను ప్యాసివ్‌గా ట్రాక్ చేసే విధంగా రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు, ముఖ్యంగా తొలిసారి పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఇన్వెస్టర్లు, ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు’’ అని పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, డిప్యూటీ ఎండీ & సీబీఓ శ్రీ డీపీ సింగ్ మాట్లాడుతూ, ‘‘ప్యాసివ్ పెట్టుబడుల విభాగంలో మరిన్ని ఆఫర్‌లను మేము అందిస్తూనే ఉన్నాము. భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రస్తుత ఇండెక్స్‌లో భాగంగా ఉన్న, భారత్‌లోని 30 అతిపెద్ద కంపెనీల (మార్కెట్ విలువ ప్రకారం) వృద్ధి నుండి ప్రయోజనం పొందడాన్ని లక్ష్యంగా చేసుకొని, ప్యాసివ్ ఇన్వెస్టింగ్‌లోని ప్రయోజనాల నుండి లబ్ధి పొందాలనుకునే వారికి ఎస్‌బీఐ ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఒక మంచి అవకాశమని నేను భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.
ఈ స్కీమ్ తన అసెట్స్‌లోని కనీసం 95% అలాగే గరిష్టంగా 100% మొత్తాన్ని ప్రాథమికంగా ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్‌లో, అలాగే 5% నిధులను ట్రైపార్టీ రెపో మరియు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లతో సహా ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ-సెక్‌లు, ఎస్‌డీఎల్‌లు, ట్రెజరీ బిల్స్ అలాగే ఆర్‌బీఐ కాలానుగుణంగా నిర్దేశించిన ఇతరత్రా ఏవైనా సాధనాల వంటివి) ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడికి కనీస దరఖాస్తు మొత్తం అనేది రూ. 5,000 ఇంకా ఆపై రూ.1 గుణిజాల్లో ఉంటుంది. రోజువారీ, వారంవారీ, నెలవారీ, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా, వార్షిక ఎస్‌ఐపి ద్వారా కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించి ప్రామాణిక ఇండెక్స్ అనేది ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ టిఆర్ఐ.
ఎస్‌బీఐ ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్‌కు ఫండ్ మేనేజర్‌గా శ్రీ రవిప్రకాశ్ శర్మ వ్యవహరిస్తారు. ఆయన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌తో సహా అనేక ప్యాసివ్ ఫండ్‌లను మేనేజ్ చేస్తున్నారు. వీటిలో ఎస్‌బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఎస్‌బీఐ నిఫ్టీ నెక్స్ట్50 ఇండెక్స్ ఫండ్, ఎస్‌బీఐ ఈక్విటీ మినిమమ్ వేరియన్స్ ఫండ్, ఎస్‌బీఐ ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ETF, ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్, ఎస్‌బీఐ నిఫ్టీ బ్యాంక్ ETF, ఎస్‌బీఐ ఎస్&పి బిఎస్ఈ 100 ETF, ఎస్‌బీఐ నిఫ్టీ నెక్స్ట్50 ETF, SBI నిఫ్టీ50 ETF, SBI S&P BSE సెన్సెక్స్ నెక్స్ట్ 50 ETF, అలాగే SBI నిఫ్టీ200 క్వాలిటీ 30 ETF వంటివి ఉన్నాయి.