తేజ దర్శకత్వంలో రాక్షస రాజా

రానా, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో రూపొందిన ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ కాంబో ‘రాక్షస రాజా’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఇదివరకూ ఎన్నడూ చూడని క్రైమ్‌ వరల్డ్‌ని ఎక్స్‌ఫ్లోర్‌ చేస్తూ ఇంటెన్స్‌ ఎమోషన్స్‌, ఫ్యామిలీ డ్రామా అద్భుతమైన సమ్మేళనంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డిఫరెంట్‌ రానాని చూడొచ్చని పోస్టర్‌ చెప్పకనే చెప్పింది. ‘నేనే రాజు నేనే మంత్రి’కి మించి ఈ సినిమా ఉంటుందని, రానా, తేజ కలయికలో మరో బ్లాక్‌బస్టర్‌ రానుంది’ అని చిత్ర బృందం తెలిపింది.