– సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి రాధె లోయ
హైదరాబాద్: 61వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్స్ (2023)లో తెలంగాణ అమ్మాయి రాధె లోయ పతకంతో మెరిసింది. సబ్ జూనియర్ (11-14 ఇయర్స్) విభాగంలో రోలర్ ఫ్రీస్టయిల్ ఈవెంట్లో రాధె లోయ రజతం పతకం సాధించింది. కర్ణాటక, తమిళనాడు అమ్మాయిలు వరుసగా గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు. నిరుడు జరిగిన జాతీయ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన ఆర్. లోయ ఈ ఏడాది సిల్వర్ గెల్చుకుంది. నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ సాధించిన లోయను ఆమె కోచ్ జితేంద్ర గుప్తా అభినందించారు.