– జర్మనీ చేతిలో పరాజయం
– జూనియర్ హాకీ ప్రపంచకప్
కౌలాలంపూర్: యువ భారత్ ప్రపంచకప్ స్వప్నం చెదిరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ చేతిలో 1-4తో పరాజయం పాలైంది. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచటంలో దారుణ వైఫల్యం చెందిన కుర్రాళ్లు.. ప్రపంచకప్ ఫైనల్‌కు దూరమైంది. సెమీఫైనల్లో భారత్‌కు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా.. అందులో ఒక్కటీ గోల్‌గా మారలేదు. మరోవైపు ఆరుసార్లు చాంపియన్ జర్మనీ.. రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. 11వ నిమిషంలో సుదీప్ భారత్‌కు ఏకైక గోల్ అందించాడు. శనివారం కాంస్య పతకం కోసం కుర్రాళ్లు మరోసారి బరిలోకి దిగనున్నారు.