శతక వార్నర్‌

Warner– ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 346/5
– పాకిస్థాన్‌తో తొలి టెస్టు తొలి రోజు
పెర్త్‌ (ఆస్ట్రేలియా): వీడ్కోలు సిరీస్‌లో డ్యాషింగ్‌ ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ (164, 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక విహారం చేశాడు. వార్నర్‌ సెంచరీకి తోడు ఉస్మాన్‌ ఖవాజ (41), ట్రావిశ్‌ హెడ్‌ (40), స్టీవ్‌ స్మిత్‌ (31) రాణించటంతో పాకిస్థాన్‌తో తొలి టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా 346/5 పరుగులు చేసింది. ఖవాజ తోడుగా వార్నర్‌ తొలి వికెట్‌కు 126 పరుగుల శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. దూకుడుగా ఆడిన వార్నర్‌ 9 ఫోర్లతో 41 బంతుల్లోనే అర్థ సెంచరీ.. 14 ఫోర్లు, 1 ఓ సిక్సర్‌తో 125 బంతుల్లో శతకం సాధించాడు. 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 196 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ అందుకున్న వార్నర్‌.. ఆతిథ్య ఆస్ట్రేలియాను భారీ స్కోరు దిశగా నడిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మిచెల్‌ మార్ష్‌ (15 నాటౌట్‌), అలెక్స్‌ కేరీ (14 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. పాక్‌ బౌలర్లలో ఆమర్‌ జమల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.