ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఇద్దరు మృతి

– ట్రాక్‌ దాటుతుండగా ఘటన
నవతెలంగాణ – పెద్దపల్లి టౌన్‌
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢకొీని పెద్దబొంకూర్‌ గ్రామానికి చెందిన రాజు(40), పెద్దపల్లి పట్టణానికి చెందిన యాకూబ్‌(45) మృతిచెందారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ క్యాంటీన్‌లో వాటర్‌ సప్లరు చేసి ట్రాక్‌ దాటుతుండగా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢకొీట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.