లాకప్‌ డెత్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలి

– బీఆర్‌ఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన బిడ్డ నేనావత్‌ సూర్య నాయక్‌ లాకప్‌ డెత్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని బీఆర్‌ఎస్‌్‌ కోరింది. ఈ మేరకు డీజీపీకి వినతి పత్రాన్ని అందజేసినట్టు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, పోలీసుల దుర్మార్గమైన చర్యవల్ల ప్రాణాలు కోల్పోయిన సూర్య నాయక్‌ కుటుంబానికి అన్ని విధాలుగా భద్రత కల్పించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.