హిట్‌ కళ కనిపిస్తోంది.. – కె.రాఘవేంద్రరావు

Hit art Looks like.. - K. Raghavendra Raoరవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రోషన్‌ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. ఈ సినిమా నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ,’ఈ ట్రైలర్‌లో సూపర్‌ హిట్‌ కళ కనిపిస్తోంది. బబుల్‌గమ్‌ మెల్లగా ఉబ్బి ఉబ్బి పెద్దగా పేలుతుంది. ఈ సినిమా టాక్‌ కూడా మెల్లగా స్టార్ట్‌ అయి సూపర్‌ హిట్‌ టాక్‌తో ఎండ్‌ అవుతుంది. రోషన్‌, మానస కెమిస్ట్రీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది’ అని తెలిపారు. ‘సుమ, రాజీవ్‌కి ఈనెల 29 ఒక ప్రౌడ్‌ మూమెంట్‌. ట్రైలర్‌ ఖచ్చితంగా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ఇందులో యూత్‌కీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి’ అని అనిల్‌ రావిపూడి చెప్పారు. రానా మాట్లాడుతూ, ‘సుమ మా జీవితాల్లో భాగమై పోయారు. రోషన్‌కి అందరి ప్రేమ, అభిమానం దక్కాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రవికాంత్‌ కథలు కొత్తగా ఉంటాయి. మంచి విజయం సాధించాలని కోరుకుం టున్నాను’ అని చెప్పారు.
రోషన్‌ మాట్లాడుతూ, ‘రాఘ వేంద్రరావు మా ట్రైలర్‌ని లాంచ్‌ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాం. ఇది చలికాలం. కొంచెం వెచ్చగా ఉండాలని ఇలాంటి ఫైర్‌ లాంటి ట్రైలర్‌ని దింపాడు రవికాంత్‌. జీవితంలో ఎదో సందర్భంలో రివేంజ్‌ తీర్చుకోవాలని పిస్తుంది. ఈ సినిమాలో ఆది పాత్ర మాటల్లో చెప్పాలంటే.. ‘ఒక రోజు వస్తది. ఆ రోజు చెవులు మూసుకున్నా వినపడతా. కళ్ళు మూసు కున్నా కనపడతా’ అని తెలిపారు. ‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్‌ చేయడం చాలా అనందంగా ఉంది. ట్రైలర్‌ కంటే సినిమా ఇరవై రెట్లు హై ఇస్తుంది. సినిమా అందరికీ క్రేజీక్రేజీగా నచ్చుతుంది. బబుల్‌గమ్‌ అంటుకుంటే తీసేయాలని పిస్తుంది. కానీ ఈ బబుల్‌గమ్‌కి ఎదురెళ్ళి అంటించు కోవాలనిపిస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడాలి’
అని దర్శకుడు రవికాంత్‌ పెరేపు అన్నారు. మానస చౌదరి మాట్లాడుతూ,’ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా చూడటానికి మీతో పాటు నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పారు.