ఇంటర్ సప్లమెంటరీ స్పాట్ ను బై కాట్ చేస్తాము : జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లికార్జున్ గౌడ్

 నవతెలంగాణ-ఆర్మూర్  : ఇంటర్మీడియట్ సప్లమెంటరీ స్పాట్ను బై కాట్ చేస్తామని జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. పట్టణంలో టి పి ఎల్ ఎఫ్ (తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ యూనియన్) ఆద్వర్యములో సోమవారం ఇంటర్మిడియట్ “స్పాట్ రెమ్యూరేషన్” గురించి ప్రైవేట్ అధ్యాపకులందరు సమావేశాము నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న అధ్యాపకులందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి కాని, స్పాట్ రెమ్యూరేషన్ డబ్బులు  ఇప్పటికి రాలేదు. ప్రభుత్వం రెండు రోజుల్లో  రెమ్యూరేషన్ రాకపోతే  వచ్చే సప్లమెంటరీ ఎక్సమ్ పూర్తయిన తరువాత సప్లిమెంటరీ స్పాట్ ని “బై కాట్” చేయబోతున్నాము. ఈ విషయం కూడా సరిగాస్పందించటం లేదు. ఈ సమావేశంలో  జిల్లా  జనరల్ సెక్రటరీ  ముంజ మల్లికార్జున్ గౌడ్ ,నిజామాబాదు టౌన్ ప్రెసిడెంట్ C. గజానంద్  ఆర్మూర్   ఇంచార్జి మురళి గౌడ్ ,స్వామి సదానంద్  తదితరులు  పాల్గొన్నారు.