– ప్రధాన కార్యదర్శి ఇంద్రశేఖర్ మిశ్రా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐఎస్టీఎఫ్) 27వ జాతీయ మహాసభలు వచ్చేనెల 11,12 తేదీల్లో కర్నూల్ పట్టణంలో జరుగుతాయని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఇంద్రశేఖర్ మిశ్రా చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్టీయూ కార్యాలయంలో ఏఐఎస్టీఎఫ్ ఆహ్వానసంఘ సమావేశాన్ని ఏపీ, తెలంగాణ అధ్యక్షులు ఎల్ సాయిశ్రీనివాస్, ఎం పర్వత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం, విద్యాహక్కు చట్టంపై చర్చా పత్రం ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏపీ, తెలంగాణ ఎస్టీయూ ప్రధాన కార్యదర్శులు హెచ్ తిమ్మన్న, జి సదానందంగౌడ్, ఏఐఎస్టీఎఫ్ కార్యదర్శి అన్సారీ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జుట్టు గజేందర్, వై కరుణాకర్‌రెడ్డి, పోల్‌రెడ్డి, కమల్ అహ్మద్, పరమేశ్వర్, భాస్కర్, ఇఫ్తకారుద్దీన్, రాధ, జయలక్ష్మి, అజర్ జహన్, పి ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.