పెర్త్‌లో పాకిస్థాన్‌ చిత్తు

– 360 పరుగుల తేడాతో ఆసీస్‌ గెలుపు
పెర్త్‌ (ఆస్ట్రేలియా): స్వదేశీ సమ్మర్‌ సీజన్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. పెర్త్‌ టెస్టులో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన కంగారూలు 360 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 450 పరుగుల ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌ పట్టిన పాకిస్థాన్‌..30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌ (3/31), జోశ్‌ హేజిల్‌వుడ్‌ (3/13) నిప్పులు చెరుగగా.. స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ (2/18) మాయ చేశాడు. ఇమామ్‌ (10), బాబర్‌ (14), షకీల్‌ (24) మాత్రమే రెండెంకల స్కోరు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 487 పరుగుల భారీ స్కోరు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌ను 233/5 వద్ద డిక్లరేషన్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులే చేసింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది. శతక హీరో డెవిడ్‌ వార్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.