సీఎంకు జోగులాంబ ఆశీర్వచనాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి జోగులాంబ అమ్మవారి ఆశిర్వచనాలను అందించారు. ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బందం జూబ్లిహిల్స్‌లోని నివాసంలో సీఎం కలిసి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివద్ధికి చొరవ చూపాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం సమర్పించారు.