ది ఫస్ట్‌ స్ట్రైక్‌ సందడి మొదలైంది..

వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి మేకర్స్‌ సోమవారం ‘ది ఫస్ట్‌ స్ట్రైక్‌’ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ‘ది ఫస్ట్‌ స్ట్రైక్‌’లో హీరో వరుణ్‌ తేజ్‌ కొన్ని పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో పాటు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సందీప్‌ ముద్దా నిర్మించారు. నందకుమార్‌ అబ్బినేని, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (వకీల్‌ ఖాన్‌) సహ నిర్మాతలు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదల కానుంది.