దూరమే తీరమై…

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న కొత్త మూవీ ‘డెవిల్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా దర్శక, నిర్మాతగా ఈ సినిమా రూపొందు తోంది. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌, పాటలు, టీజర్‌ సూపర్బ్‌ రెస్పాన్స్‌ని రాబట్టకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మేకర్స్‌ ఈ మూవీ నుంచి ‘దూరమే తీరమై..’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. సమీర భరద్వాజ్‌ ఈ పాటను రాసి, పాడటం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు.