ఎల్‌బీస్టేడియంలో 22న క్రిస్మస్‌ వేడుకలు

– ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ
– పాల్గొననున్న సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 22న ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.కాంతి వెస్లీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏడాది ఆనవాయితిగా ఈ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి విధితమే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.