శ్రీ నిమ్మ గుండ్ల ఎల్లమ్మ తల్లి  పండుగలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు మంగళవారం, శ్రీ నిమ్మ గుండ్ల ఎల్లమ్మ తల్లి  పండుగ లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆలేరు నియోజకవర్గం ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు, సైదాపురం సర్పంచ్ బీర్ల శంకర్,  మాజీ సర్పంచ్ సీసా మనోహర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గుజ్జ బలరాం, ఎంపీపీ చీర శ్రీశైలం, కాల్నే స్వామి, గంధ మల్ల రాములు, జాగిలాపురం లక్ష్మీనారాయణ, డీలర్ శంకర్, కొల్లూరు కిష్టయ్య, తుంగ అశోక్, కాల్నే రాజు  గుండ్లపల్లి భరత్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.