
మారికో లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సోమశ్రీ బోస్ అవస్థి ఈ కొత్త ఆవిష్కరణ గురించి తన ఉత్సా హాన్ని పంచుకున్నారు, “మారికోలో, ప్రజల జీవితాల్లో నిజంగా మార్పు తెచ్చే ఉత్పత్తులను రూపొందించ డంలో మేం చాలా గర్వపడుతున్నాం. పారాచూట్ అడ్వాన్స్ డ్ సంపూర్ణ పరిచయం మా హెయిర్ కేర్ పోర్ట్ ఫోలియోలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. నేటి వేగవంతమైన జీవనశైలిలో, జుట్టు అందంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ‘ఎక్స్ ట్రా కేర్’ అవసరం. అలాంటి ‘ఎక్స్ ట్రా కేర్’ను కొబ్బరి పోషక శక్తిని ఐదు అసాధారణమైన మూలికలు -ఆమ్లా, మందార, కలబంద, మేతి, కరివేపాకు– తో కలపడం ద్వారా ‘పారాచూట్ అడ్వాన్స్ డ్ సంపూర్ణ’‘ అందిస్తుంది”. పారాచూట్ అడ్వాన్స్ డ్ సంపూర్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంది.