సమస్యలను పరిష్కరించాలి

–  ఎస్‌జీటీయూ రాష్ట్ర శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జీవో 317 ఉద్యోగ, ఉపాధ్యాయ బాధితుల సమస్యలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని ఎస్‌జీటీయూ రాష్ట్ర శాఖ కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహిపాల్‌ రెడ్డి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అరికెల వెంకటేశం, యాదాద్రి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశం, మెదక్‌ జిల్లా బాధ్యులు రామకృష్ణ మంత్రులు డాక్టర్‌ ధనసరి సీతక్క, శ్రీధర్‌ బాబు, విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంకు విన్నవించారు. 13 జిల్లాలకు చెందిన స్పౌజ్‌లను ఒకే జిల్లాలో కేటాయించాలని కోరారు. ప్రతి పాఠశాలలో పరిశుభ్రత కోసం సర్వీస్‌ పర్సన్లను నియమించాలనీ, ప్రతి మేజర్‌ పంచాయితీకి ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.