నవతెలంగాణ-బెజ్జంకి
రోజువారి కూలీ చేసుకునే నిరుపేద మహిళలకు,నెలవారిగా వేతనాలందుకునే ప్రభుత్వ ఉద్యోగులకు మహాలక్ష్మి పథకంలో ప్రభుత్వం సమప్రాదన్యత ఇవ్వడం సరైందికాదని..ఆర్టీసీ నష్టాలబాటలో వెళ్లకుండా మహాలక్ష్మి పథకం అమలులో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా సవరణలు చేయాలని డీఎస్పీ మండలాధ్యక్షుడు లింగాల సురేశ్ మహారాజ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం తహసీల్ యందు తహసిల్దార్ శ్యామ్ కు మహాలక్ష్మి పథకంలో సవరణలు చేసి అన్ని వర్గాల వారికి ప్రభుత్వం మేలు చేసేల హేతుబద్దీకరించాలని డీఎస్పీ పక్షాన వినతిపత్రమందజేసినట్టు సురేశ్ మహారాజ్ తెలిపారు.