బోర్గం గ్రామంలో వికాసి భారత్ సంకల్ప యాత్ర..

నవతెలంగాణ- రెంజల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో వికాసి వార సంకల్పయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచ్ పార్ధవాని పేర్కొన్నారు. గురువారం బోర్గం గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని బడుగు బలహీన వర్గాల ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. 17 శాఖల అంశాలకు సంబంధించిన అధికారులు ఈ పథకాల గురించి వివరించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, విజ్జల్ సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, బిజెపి మాజీ మండల అధ్యక్షులు సంతోష్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, సిద్ధ సాయిలు, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, బ్యాంకు మేనేజర్ లక్ష్మీనారాయణ శాస్త్రి, గ్రామ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.