భారీ సెట్‌లో టైటిల్‌ సాంగ్‌

నాగార్జున నటిస్తున్న మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నా సామిరంగ’. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి విజరు బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి ఫుట్‌ ట్యాపింగ్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేయగా, చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించారు. ఈ మాస్‌ నంబర్‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కూడా అలరించనున్నారు. సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. దినేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. నాగార్జున సరసన ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్‌ కుమార్‌ సమర్పకుడు. ఈ చిత్రం సంక్రాంతికి థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతుంది.