ఘనంగా తృతీయ వార్షికోత్సవం

వినోద్‌ ఫిల్మ్‌ అకాడమీ దిన దిన ప్రవర్ధమానమై మరింతగా ఎదగాలని నిర్మాత, కష్ణాజిల్లా లైన్స్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ పుట్టగుంట వెంకట సతీష్‌ అన్నారు. ఇటీవల జరిగిన వినోద్‌ ఫిల్మ్‌ అకాడమీ తతీయ వార్షికోత్సవంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. దర్శకుడు శివ నాగేశ్వరరావు అకాడమీతో తనకిఉన్న అనుబంధాన్ని వివరించారు. ‘తమ సంస్థ అందరికీ అందుబాటులో ఉంటుందని, సరైన శిక్షణతో నూతన ప్రతిభను పరిశ్రమకు అందజేస్తాం’ అని అకాడమీ వ్యవస్థాపకుడు వినోద్‌ చెప్పారు. అకాడమీ ప్రిన్సిపాల్‌ కిషోర్‌ దాస్‌ వందన సమర్పణ చేశారు. ఇందులో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు.