ప్రపంచ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంచల మండలం ఆదర్శ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు గణితం పై అవగాహన కల్పించడం జరిగిందని గంధ శాస్త్ర ఉపాధ్యాయురాలు సుష్మ పేర్కొన్నారు. శుక్రవారం విద్యార్థుల భయాన్ని తొలగించడానికి వివిధ రకాలైన గణిత సూత్రాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. దీనిలో భాగంగా వ్యాచారచన పోటీలు, రంగోలి, గణిత శాస్త్ర ఉపకరణాలను విద్యార్థులచే తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ చెన్నప్ప, అయేషా ఫాతిమా, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ మమ్మాయి నాగరాజ్, గణిత ఉపాధ్యాయురాలు సుష్మ, ఉపాధ్యాయులు ధంలా, గీత, శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు..