కవ్వంపల్లి విజయంతో కొండగట్టుకు పాదయాత్ర 

– శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వద్ద పాదయాత్ర ప్రారంభం
నవతెలంగాణ-బెజ్జంకి 
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ విజయం సాధించడంతో ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,గుభిరే చంద్రం, సంగెం రాజేందర్,గంగుల ఎల్లం,గంగుల ఐలయ్య కొండగట్టు వద్ద అంజనేయ స్వామి ఆలయం వద్దకు పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించారు.పాదయాత్రకు మద్దతుగా మండలంలోని అయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు హజరయ్యారు.