– అభినందించిన బేగంపేట ఉన్నత పాఠశాల బోధన సిబ్బంది
నవతెలంగాణ-బెజ్జంకి
జనవరి 2 నుండి 5 వరకు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరగనున్న 67వ జాతీయ బేస్ బాల్ పోటీలకు మండల పరిధిలోని వడ్లూర్ బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో విధ్యనభ్యసిస్తున్న ఎగోలం నిహారిక ఎంపికైనట్టు పీఈటీ సతీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఇటీవల తొర్రూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీల్లో నిహారిక ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రశంసలు అందుకుందని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయమని పాఠశాల బోధన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.నిహారికను సర్పంచ్ సంజీవ రెడ్డి,ఎస్ఎంసీ చైర్మన్ జనాగం శంకర్, ప్రధానోపాద్యాయుడు గోపి కృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.