బిఎస్ పి పార్టీకి మహతి రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ గల్ఫ్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం తెలియజేశారు. తాను తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులు అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గల్ఫ్ కోఆర్డినేటర్ పదవులకు ఈరోజు రాజీనామా చేయుచున్నాను అని తెలిపారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు ,పార్టీ పదాధికారులకు, అలాగే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నా యెక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు. తన రాజీనామాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ అదేవిధంగా తెలంగాణ జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ కు తన రాజీనామా పత్రాన్ని పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.