లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవాతరుణి సేవలు ఆదర్శనీయం 

–  ప్రధానోపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి
– విద్యార్థికి వీల్ చైర్ అందజేత
నవతెలంగాణ- పెద్దవంగర
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవాతరుణి సేవలు ఆదర్శనీయమని ప్రాథమిక పాఠశాల అవుతాపురం ప్రధానోపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సేవాతరుణి సంస్థ అధ్యక్షురాలు వజినపల్లి శైలజ కుమారుడు సాత్విక్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలకు చెందిన 3వ తరగతి చదువుతున్న దివ్యాంగుడు ఆవుల శివకుమార్ కు రూ. 7 వేలు విలువ చేసే వీల్ చైర్ అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళాధర్ తో కలిసి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. సేవాతరుణి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ నాగవాణి, శ్రీదేవి, విజయ, ఉపాధ్యాయులు చిరంజీవి, ప్రతిభ, పల్లె రజిత, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, ఝాన్సీ అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.