క్రిష్ణవేణి లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని క్రిష్ణవేణి ఉన్నత పాఠశాలలో  గణిత శాస్త్ర దినోత్సవాన్ని  శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా గణిత శాస్త్రానికి సంబంధించిన ఆకారాలు అయిన చతురస్రం, దీర్ఘ చతురస్రం, గోళాకారం, త్రిభుజం ఆకారాలు విద్యార్థిని విద్యార్థులు తయరు చేసి ప్రదర్శించారు. అంకెలతో కూడిన గోడ గడియారమ తయారు చేశారు. గణితం లోని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహరాలు ఏవిధంగా చేయాలో చార్ట్ ద్వారా ప్రదర్శించి, గణితం చేయడానికి ముఖ్యంగా ఎక్కలు అవసరం వాటిని చార్ట్ ద్వార ప్రదర్శించి విద్యార్థులు వివరించారు. గణిత శాస్త్రా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉపన్యాసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ  గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గణిత శాస్త్రవేత్తలకు మన దేశం పుట్టినిల్లు అని తెలిపారు.పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెత శ్రీనివాస రామానుజన్ జీవితానికి స్వార్థకమైందని తెలిపారు.చిన్న వయసు నుండి వయసుకు మించిన ఊహకందని, జఠినమైన గణిత శాస్త్ర సమస్యలను సాధించేవాడని, ఆయనకు నిరంతరం గణితమే నిద్రాహారాలని విద్యార్థులకు తెలియజేశారు.అలాంటి రామానుజన్ మన భారతీయులకు గర్వకారణం అని, నిత్య స్మరణీయుడని అలాంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చిలుక గంగా ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కుందారం సచిన్, ఉపాధ్యాయులు కమల్, స్రవంతి, మనోజ్ఞ, రమ్య, తబసుమ్, స్వప్న, రూప శ్రీ, షాహిన్, నిఖిత, తదితరులు పాల్గొన్నారు.