రెంజల్ మండలం నీల పేపర్ మిల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి శుక్రవారం నాడు అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆమె చిన్నారులకు ప్రతిరోజు పౌష్టికాహారం అందించాలని ఆమె అంగన్వాడి టీచర్ ను ఆదేశించారు. తల్లులకు పోషణ అభియాన్ మరియు న్యూట్రి గార్డెన్ పై అవగాహన కల్పించారు. సుకన్య సమృద్ధి యోజన దరఖాస్తులపై అవగాహన కల్పించారు. చిన్నారులకు పోషకాహారంతో పాటు క్రీడల్లో ఆసక్తి చూపించాలని ఆమె సూచించారు. గర్భిణీ బాలింత మహిళలకు పౌష్కారంపై అవగాహన కల్పించడంతోపాటు తమ ఇంటి పెరట్లో ఆకుకూరలు పండించుకోవాలని సూచించారు. వెంట అంగన్వాడి టీచర్ పద్మావతి, గర్భిణీ బాలింత మహిళలు చిన్నారులు పాల్గొన్నారు..