మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డిఎం) సత్యజిత్ అన్నారు. శుక్రవారం నా బార్డ్ వారి సహకారంతో, ఐఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ తీసుకుంటున్న ఎస్హెచ్జి మహిళలతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాబార్డు ద్వారా అందిస్తున్న ఇలాంటి శిక్షణ మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవా లని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వారి వ్యవసాయ ఆదాయానికి అద నంగా ఈ శిక్షణ జీవనోపాధిని మెరుగు పరుస్తాయ న్నారు.శిక్షణ పొందిన అనంతరం మీరు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం కోసం ముద్ర లోన్ ద్వారా గాని లేదా పిఎంఈజిపి ద్వారా రుణ సౌకర్యం పొందాలన్నారు. నేర్చుకున్న వారికి క్రెడిట్ లింకేజీ కోసం ఎన్జీవో యూనియన్ బ్యాంక్ మేనే జర్ గారిని సంప్రదించి అవసరమైన రుణ వసతి కల్పించి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగే విధంగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొండ్ర రాజలిం గం, ట్రైనర్ రజిత, మహిళలు పాల్గొన్నారు.