ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి.. యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ నిరసన..

నవతెలంగాణ -డిచ్ పల్లి
గత ప్రభుత్వం యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు విద్యా అందనీ ద్రాక్షగా మారిందని రాచకొండ విఘ్నేష్ అన్నారు. శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు లో బాగంగా తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కాలేజి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులకు సహాయ సౌకర్యాలు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, ఇంతకు యూనివర్సిటీ లో ఉండే అదికారులు ఏమి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు విద్యా అందనీ ద్రాక్షగా మారిందన్నారు. విద్యార్థులపై మెస్ చార్జీలా అదనపు భారన్ని తగ్గించాలని అన్నారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల సౌకర్యార్థం కోసం హాస్టల్లో వైఫై పునరుద్ధరణ, సెల్ టవర్లను ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం అధికారులు పట్టించుకోవాలని ఇలా సమస్యలతో సాహసం చేస్తున్న పట్టించుకోక పోవడం విచారకరమన్నారు.ఇప్పటికైన అదికారులు స్పందించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్, సహాయ కార్యదర్శి పవన్, నాయకులు చిత్రు, ప్రహ్లాద్, శంకర్, లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.